ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం – మంత్రి ఎన్ఎండి ఫరూక్,మార్కెట్ యార్డుచైర్మన్ గుంటుపల్లి

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 10అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ఆవశ్యకతపై ప్రజలలో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నంద్యాల స్థానిక టేక్కే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన ‘కామధేను సిరి సంపద – నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి, వాటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతోనే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని . రసాయన ఎరువులు, పురుగుమందులు లేని ఆహారం మన ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని . రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు , రైతులు ఈ విధానంలో సాగుచేసి, ప్రజలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలి, అని పిలుపునిచ్చారు. గో ఆధారిత వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుందని, పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సాగులో ముందుండాలని ఆకాంక్షించారు.

నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడంలో మార్కెట్ యార్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందని. ఈ సంత ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మంచి వేదిక లభించిందని తెలిపారు.

ఈ సంతలో వివిధ రకాలైన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, కాయగూరలు, చిరుధాన్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు మరియు అమ్మకానికి ఉంచారు. రైతులు, స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రివర్యులు ఫరూక్ పరిశీలించి, రైతులతో, వినియోగదారులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్.పీకే ప్రచార సాధకులు మరియు ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరాం , నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగ ప్రసాద్ , ప్రముఖ పారిశ్రామికవేత పబ్బతి వేణు, డిపిఎం ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు యాదవ్, ఏడిపిఎం ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ అబ్దుల్ సలామ్,కామధేను సిరిసంత వ్యవస్థాపకులు కర్రెద్దుల బాలమదిలేటి, కామదేను సిరి సంత వ్యవస్థాపకుడు సుబ్బారావు , ధనుంజయ రెడ్డి, లత , అయ్యలూరు టిడిపి అధ్యక్షులు త్రిలింగేశ్వర్ రెడ్డి మరియు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైతులు, ప్రకృతి వ్యవసాయ అనుభవజ్ఞులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *