ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ నంద్యాల కర్నూలుజిల్లా
నంద్యాలజూలై12(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లానంద్యాలమునిసిపాలీటీలోఇటీవల విలీనమయిన గ్రామపంచాయితీలు మూడుత్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నాయి..నంద్యాల త్వరలో జిల్లాకేంద్రంగా ఏర్పాటుకానుండటంతో నంద్యాలశివారు ప్రాంతాలు ఇబ్బడిాముబ్బడిగా పెరిగాయి..దీనికి తోడుగా విద్యవైద్యం రీత్యా ఆళ్లగడ్డ,కోవెలకుంట్ల ,బనగానపల్లె, తదితర ప్రాంతాలప్రజలునంద్యాలకుచేరడంతోఇక్కడజనాబాయేటయేటాపెరుగుతోంది..రెండులక్షలకుపైగా నంద్యాల ప్రాంతంలో జనాబా ఉంది..దీంతో మునిసిపల్ పరిది శివారు ప్రాంతాలలో సైతం ప్రజలు స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు.యేడాదిన్నర క్రితం శివారు ప్రాంతాలలోొ ఉన్న రైతునగరం, ఉడుమాల్పూరం,పొన్నాపురం గ్రామపంచాయితీలను ప్రభుత్వం నంద్యాలమునిసిపాలిటీలో విలీనంచేసింది..దీనితో పాటు కొత్తపల్లి గ్రామపరిదిలోని కొన్ని సర్వేనెంబర్ల పరిదిని నంద్యాలమునిసిపాలిటీలో ప్రభుత్వం విలీనంచేసింది..అయితే అప్పటినుండే ఈప్రాంతప్రజలకు కష్టాలుమొదలయ్యాయి..ఆఘమేఘాలమీద ఈపంచాయితీలను మునసిపాలిటీలో విలీనంచేశారు కాని మౌళికసదుపాయాలు సాంకేతిక సదుపాయాలు కల్పించడం మునిసిపల్ అదికారులు విఫలమయ్యారు..ఈపంచాయితీ పరిదిలోని రికార్డులుమొత్తం పంచాయితీలనుండిమునిాసిపాలిటీ తీసుకుంది..కొత్తాగా ఏపనిచేపట్టాలన్నా మునిసిపల్ అనుమతులు తప్పనిసరి..,అయితే మునిసిపల్ అదికారులు మాత్రం ఈగ్రామాలపరిదిలోని భూములను ఇళ్లను ఆన్ లైను చేయకపోెవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.ఉదాహరణకు ఈగ్రామాల పరిదిలో ఇళ్లుకట్టుకోవాలంటే ఖాళీస్థలాీనికి తొలుత వెకెంట్ ల్యాండ్ టాక్స్ కట్టడం తప్పనిసరి..తరువాత మునిసిపల్ అప్రూవల్ తీసుకోవాలి..వీటన్నింటికి ముఖ్యంగా రికార్డులు ఆన్ లైను కావాలి..దీంతోె గత ఏడాదిన్నరనుండి ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకోవాలంటే అటు పంచాయితీ అనుమతి ఇవ్వదు..ఇటు మునసిపాలిటి అనుమతి తీసుకోవడం సాద్యంకాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..ఆఘమేఘాలమీద మమ్మలను తీసుకెళ్లి మునిసిపాలిటీలోొ ఎవరు కలపి ఇప్పుడు మమ్మలను త్రిశంఖుస్వర్గంలో పెట్టారని మూడు పంచాయితీల పరిదిలో ప్రజలు వాపోతున్నారు..ఈవిషయంపై మునిసిాపల్ కమీషనర్ వెంకటకృష్ణ దృష్టికి ప్రజాటివి సమస్యను తీసుకువెళ్లింది…ఆయన వెంటనే స్పందించారు…సమస్య ఉన్నమాట వాస్తవేనని అంగీకరించారు..సంబందిత సిబ్బందితో వెంటనే సమావేశంనిర్వహించారు..జూలై 15 వతేదీనాటికి మూడు పంచాయితీలసర్వేనెంబర్లును ఆన్ లైను చేసి వెకెంట్ ల్యాండ్ టాక్స్ తోపాటుగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు..