ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల పిబ్రవరి 12( ప్రజాన్యూస్)
JEE ఫలితాల సందర్భంగా ఉత్తమ జేఈఈ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి అభినందించారు. వారు మాట్లాడుతూ..
ఉత్తమ విద్య కోసం ఇక నుండి విద్యార్థుల తల్లిదండ్రులు వ్యయప్రయాసల కోర్చి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని నంద్యాల న్యూక్లియస్ అకాడమీ ద్వారా సీనియర్ NEET / JEE ఫ్యాకల్టీ ని ఏర్పాటు చేసి ఉత్తమ శిక్షణను అందజేస్తున్నారు కనుక విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కళాశాల డైరెక్టర్ N V వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యుత్తమ జాతీయ స్థాయి ర్యాంకులను సాధించడం న్యూక్లియస్ కు సంప్రదాయం గా మారిందని, భవిష్యత్తు లో న్యూక్లియస్ మరింత ఎక్కువ మంది ఐఐటియన్లను నంద్యాల నుండి తయారు చేస్తుందని తెలిపారు. కళాశాల సలహాదారులుM. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్ధులు దూరప్రాతాలలో ఉన్న విద్యాసంస్థలలో అధిక ఫీజులు చెల్లించి చేరుతున్నారని, మన ప్రాంతంలో మిగిలిన కొద్దిమంది విద్యార్థులతోనే ఆశ్చర్య పోయే అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నామని , తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో JEE అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.