ప్రజాటివి ప్రతినిది అక్షింతల శ్రీనివాసులు
ఆళ్లగడ్డ,పిభ్రవరి 12,(ప్రజాన్యూస్) కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును బుధవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ,భార్గవ రామ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయాలని నిరుద్యోగ సమస్య నిర్మూలనకు ఆళ్లగడ్డలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఎమ్మెల్యే అఖిల ప్రియ కోరారు. వారి వినతి పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే అఖిల ప్రియ తెలిపారు