ప్రజాటివి ప్రతినిది అక్షింతల శ్రీనివాసులు
అహోబిళం,పిభ్రవరి 12( ప్రజాన్యూస్);ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి కుమారుడు కీడాంబి మధుసూధన్ స్వామి వివాహ వార్షికోత్సవం, స్వర్గీయ అర్చకులు కృష్ణమాచారి వర్ధంతి సందర్భంగా సుమారు రెండు వందల మంది విద్యార్థిని, విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం సత్యాలు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.