!!రామకృష్ణ విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఈనెల 10 చివరితేది!!

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

రాయలసీమలోనే అత్యున్నత విద్యాసంస్థలుగా  పేరు ప్రఖ్యాతులు సాధించిన, నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో చేరడానికి విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. గత రెండు రోజుల నుండి కళాశాలలో ఏర్పాటుచేసిన రెండు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రాలకు సుదూర ప్రాంతాల నుండి వచ్చి పేర్లను నమోదు చేసుకుంటున్నారు.ఆరు కోర్సులు ఉన్న రామకృష్ణ విద్యాసంస్థల్లో, సొంతంగా ఆన్లైన్ చేసుకునే వారు కొందరైతే, కొందరు కళాశాలకు వచ్చి హెల్ప్ లైన్ కేంద్రాలను చేరుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈసందర్బంగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అడ్మిషన్లకు ఈనెల 10 వతేదీన చివరి తేదీ అని ఆసక్తి ఉన్న విద్యార్ధులు అడ్మిషన్లకు కళాశాల కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు..ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేస్తామని ఒకవేళ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే మొత్తాలను కూడా వారికి తిరిగి చెల్లిస్తామని, మొత్తం పారదర్శకంగానే ఉంటుందని రామకృష్ణారెడ్డి తెలిపారు.BBA కు,BCA కు ఏడాదికి 18వేలు చొప్పున, బీఎస్సీ కంప్యూటర్స్ లో చేరే వారికి 15వేలు, బీకాం జనరల్ లో చేరేవారికి 12వేలు, చెల్లించాల్సి ఉంటుందని ఇది ఇప్పటివరకు ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయం అన్నారు ఒకవేళ మార్పులు ఉంటే అదే పద్ధతిని ఫాలో అవుతామన్నారు.ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చని 19వ తేదీన సీటు అలాట్మెంట్ జరుగుతుందన్నారు.ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు జనరల్ అయితే 400/-బీసీ అయితే 300/-ఎస్సీ ఎస్టీ అయితే 200/- మాత్రమే చెల్లించాలని ఆయన తెలిపారు.

కళాశాలలో ఉన్న కోర్సులు : B.Sc లో Mtahs కూడిన కంప్యూటర్స్, B.Sc botany,B.Com Computers, B.Com.General, B.C.A, B.B.A కోర్సులు ఉన్నాయన్నారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *