నంద్యాల జూలై8(ప్రజా న్యూస్):రాష్ట్ర ప్రభుత్వం నెఫు రైతు దినోత్సవం పేరుతో సంబరాలు మాని రైతు దగా దినోత్సవం జరుపుకోవాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని ఆ పథకాలన్నీ తీసివేసి రైతులను నట్టేట ముంచిన వ్యక్తి సీఎం జగన్ అని ఆరోపించారు. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణయంత్రాలనుఅందించినఘనతచంద్రబాబు ప్రభుత్వా నిదేఅని గుర్తు చేశారు. రైతు భరోసా పేరిట కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని రైతులకు అందజేయడం లేదని అన్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. రైతు సంక్షేమం మరచి రైతు దినోత్సవం ఎలా జరుపుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుని రైతులకు చేసింది శూన్యం అని అన్నారు.కార్యక్రమంలో నంద్యాల మండలం మాజీ అధ్యక్షుడు జ్వాలా తిరుమలేసు, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు