నంద్యాల జులై8(ప్రజాన్యూస్):రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ద్యేయమని నంద్యాల ఎం ఎల్ ఏ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు
YSR రైతు దినోత్సవం సందర్భంగా నూనెపల్లె లోని RARSలో రూ 55లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డా.YSR అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు
ఈ సందర్భంగా శానసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దండగ అనే సమయంలో వ్యవసాయం పండగ అనే విధంగా రైతు లకు భరోసా ఇచ్చిన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకుఅవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారన్నారు.గతంలో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారని ఇప్పుడు రైతు పండించిన పంటను వారి గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారన్నారు అలాగే రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని అలా ఏ రైతు ప్రాణాలు పోకుండా ఉండేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ అగ్రి ల్యాబ్ ను ఏర్పాటు చేసి సీడ్ విత్తనాలను టెస్టింగ్ చేయడం జరుగుతుందన్నారు.ఎన్నికలలో చెప్పినటువంటి హామీలను నెరవేర్చుకుంటు రైతులకు వారి అకౌంట్ లో రైతు భరోసా నిధులు వేయడంజరుగుతుందన్నారు ఏక్కడ అవినీతి లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కిసాధ్యమైందన్నారు గత ప్రభుత్వాల కంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇవే నిదర్శనం అన్నారు రైతులందరూ వైయస్సార్ అగ్రి ల్యాబ్ ను ఉపయోగించుకోవాలని తెలియజేశారుఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి , నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బజ్ పాయ్,DCMS PP నాగిరెడ్డి, వ్యవసాయ శాఖఅధికారులుఉమామహేశ్వరమ్మ,DCEOరామాంజనేయులు,BR అగ్రికల్చ ర్ర మాదేవిమరియువ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈషాక్ భాష, మున్సిపల్ చైర్మన్ మబన్ని సా ,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్,బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ చంద్ర శేఖర్ .21వార్డు వైస్సార్సీపీ ఇంచార్జ్ అనిల్ అమృత రాజు.21వార్డు కౌన్సిలర్ చెరుకూరి శ్రీదేవి , మరియు YSR CP నాయకులు పాల్గొన్నారు