మూల్పూరి ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
ప్రత్యేక వ్యూహంతో సీమ వ్యాప్తంగా మద్దతుకు ఏర్పాట్లు
విద్యార్ధి యువజన సంఘాలతో ప్రత్యేకంగా భేటీలు
సీమ వనరులపై అవగాహనకోసం గ్రేటర్ రాయలసీమ పుస్తకం విడుదల
ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనానికి ప్రదాన కారణం విశ్లేషిస్తూ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటే ప్రదాన పరిష్కారం అని నిర్ణయానికి వచ్చారు మేదావులు…దాదాపు 50 దశాబ్దాలపాటు గల్లీనుండి డిల్లీ దాకా రాజకీయాలను సామాజిక పరిస్థితుల నిజస్వరూపంచూసిన సీనియర్ రాజకీయవేత్త మాజీ రాజ్యసభసభ్యులు గంగుల ప్రతాపరెడ్డి ఆద్వర్యంలో గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ఊపందుకోనుంది..
రాష్ట్రవిభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నాయకులు గంగుల ప్రతాపరెడ్డి రాష్ట్రంవిభజనచేస్తే మూడుగా చేయాలన్న డిమాండును అప్పుడే వినిపించారు..ఎఐసిసి అధ్యుక్షురాలు సోనియాగాందీకి అప్పటి ప్రదాని మన్నోహన్ సింగ్ కు గంగుల ప్రతాపరెడ్డి ప్రత్యేకంగా లేఖరాశారు…రాష్ట్ర విభజన జరిగితే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, 7జిల్లాలతో కూడిన ఆంద్రా, 6జిల్లాలతో కూడిని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని ఆలేఖలో ఆయన డిమాండ్ చేశారు..
మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంద్రప్రదేశ్ విడిపోయాక రాయలసీమలోని కర్నూలు రాజదానిగా ఉన్నప్పటికి భాషాప్రయుక్త రాష్ట్రాలు తెరపైకి వచ్చినప్పుడు కర్నూలులో రాజదానిని కోల్పోయిన వైనం శ్రీభాగ్ ఓప్పందం ఉల్లంఘన వల్ల రాయలసీమప్రాంతానికి జరిగిన నష్టాలను ఆయన నాటి ప్రదానికి వివరించారు..తెలంగాణా ఆంద్రప్రాంతాలు రాష్ట్రాలుగా విభజిస్తే అబివృద్దికి ఆయాప్రాంతాల్లో ఏయే వనరులు ఉన్నాయో రాయలసీమ ప్రాంతాలలో ఉన్న వనరులపై పూర్తి అవగాహనతో మాజీ రాజ్యసభసభ్యులు గంగుల ప్రతాపరెడ్డి గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర విభజనకు ఆదాయవనరులు కూడా ఆలేఖలో చక్కగా వివరించారు..
.ఆనాటి పరిస్థితులవల్ల సమైఖ్యఆంద్రపై సీమాంద్ర ప్రజలు ఆశలుపెట్టుకోవడంతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు అంశం మరుగున పడింది…అయితే తాజాగా రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుతపరిస్థితులలో మూడు రాజదానుల అంశంతోపాటుగా పలు అంశాలతో సీమప్రాంతానికి తీరని నష్టంజరుగుతోంది..నాటినుండి నేటి వరకు ఉమ్మడి రాష్ట్ర,విభజన రాష్ట్రాలను సీమ ప్రాంతనేతలు పాలించినప్పటకి సీమ ప్రాంత వెనుకబాటుతనంలో మార్పులేదు..ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న మాజీ రాజ్యసభసభ్యులు ప్రత్యే క రాయలసీమ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రంతరంచేసేందుకు ముందుకు కదిలారు..తొలుత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన ఆంద్రప్రదేశ్ భౌగోళిక రాజకీయ ఖనిజవనురులు నీటిపారుదల అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రేటర్ రాయలసీమ పుస్తకం విడుదలచేశారు.
.రాయలసీమ రాష్ట్రం ఏర్పడితో అందుబాటులో వనరులు ఖనిజసంపద టూరిజం తదితర అనేక అంశాలను ఈపుస్తకంలో ప్రచురించారు..ఈపుస్తకం ద్వారా సీమప్రజానికాన్ని తొలుత చైతన్య పరిచేందుకు తాను ఈపుస్తకాన్ని విడుదలచేసినట్లు ఆయన తెలిపారు..తమ డిమాండ్లలో భాగంగా తిరుపతి రాజదానిగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలని సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు రాయలసీమలో వివిద దశల్లో నిర్మాణంలో ఉన్న అన్ని జలవనరులు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయలని కడపజల్లాలో బ్రహ్మణి స్టీలు ప్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసే భాద్యతను కేంద్రమే తీసుకోవాలని అనంతపురంలో ప్రతిపాదిత సైన్సు సిటీ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని తిరుపతి విమానాశ్రయాన్ని విస్తరించిన దానిని అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించాలని అలాగే కడప, పుట్టపర్తి విమానాశ్రయాల ఆధునీకరణతోపాటు ప్రతిపాదిత నెల్లూరు ఓంగోలు మరియు కర్నూలు విమానాశ్రయాలను కూడా పూర్తిచేయాలని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంలో ఐఐటి ఐఐయం లను ఏర్పాటుచేయాలని, ఐటిఈఆర్ మరియు సెజ్ లను ఏర్పాటుచేయాలని రాయలసీమలో నెలకొన్న అపార ఖనిజసంపదల దృష్ట్యా దానికి సంబందించిన పరిశ్రమలు ఏర్పాటుచేయాలని అలాగే వ్యవసాయ సంభంద పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలను టాక్స్ హాలిడేను ప్రకటించాలని, తద్వారా ఉపాది అవకాశాలు పెంపొందించాలని కేంద్రప్రభుత్వం స్థాపించిన ఎఐఐఎంఎస్ లాంటి హోదాకలిగిన ఆస్పత్రులను గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటుచేయాలని గంగుల డిమాండ్ చేశారు..
ప్రజల్లో తొలుత ప్రాదమిక అవగాహన తెచ్చానని తాను రాజకీయాలకు దూరంగా లేనని గ్రేటర్ రాయలసీమ ఉద్యమంతో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నానన్నారు..ఈనేపద్యంలో సీమలోని 6జిల్లాలలో పర్యటించి కార్యచరణ ప్రారంభించానన్నారు..తనతోపాటుగా సీనియర్ రాజకీయవేత్తలను మేదావులను విద్యార్ధి సంఘాలను ఏకంచేసి ఉగాదినుండి ఉద్యమానికి ఊపిరిపోస్తానన్నారు..
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉందని ఇది సరైనా సమయంగా భావించిన కేంద్రప్రభుత్వానికి సరైన రీతిలో సీమరాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తామన్నారు..మోది ఆశీస్సులతో సీమరాష్ట్ర ఏర్పాటుకు తాను పోరాటం సాగిస్తానన్నారు..కరోనా నేపద్యంలో ఉద్యమాన్ని సాదారణస్థాయిలో తీసుకువెళుతున్నానని ప్రజల్లో పూర్తిచైతన్యం తెచ్చామని ఇక ఉద్యమాన్ని తీవ్రతరంచేయడంతోపాటుగా 2024 ఎన్నికలలో క్రియాశీలంగా రాజకీయాలలో కూడా పాల్గొంటానని గంగుల ప్రతాపరెడ్డి స్పష్టంచేశారు..కాగా గంగుల చేపట్టిన ఉద్యమానికి ఇప్పటికే ఆరు జిల్లాలలో పార్టీలకు అతీతంగా రాజకీయనాయకులు, విద్యార్ధి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి..
బెస్టె ఆప్ లక్ టు గంగుల ప్రతాపరెడ్డి గారు