ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,07మే 2025(ప్రజాన్యూస్)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం సాయంత్రం పోలీసులు మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచనల మేరకు ఆళ్లగడ్డ డి.ఎస్.పి కె. ప్రమోద్ ఆధ్వర్యంలో దేవస్థానం పరిసరాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూదేవస్థానం సిబ్బంది, పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ మరియు వైద్య విభాగం సమన్వయంతో ఈ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వివిధ విభాగాల సహకారంతో ఎలా స్పందించాలో ఈ డ్రిల్ ద్వారా ప్రదర్శించడం జరిగిందన్నారు.ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ఉగ్రదాడులు, అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై భక్తులకు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు.పోలీసు సిబ్బంది ప్రజలను రహదారులపై నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గృహ నివాసితులు ఇళ్లలోనే ఉండాలి, గ్యాస్ స్టౌవ్, విద్యుత్ లైట్లు ఆఫ్ చేసి సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి, టౌన్ సీఐ యుగంధర్, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.