ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,07మే 2025(ప్రజాన్యూస్)
ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామంలో ఈనెల 4 న జరిగిన చెన్నూరు రమేష్(25) హత్య కేసులో బుధవారం ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఆళ్లగడ్డ డి.ఎస్.పి కొలికేపూడి ప్రమోద్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరు గ్రామానికి చెందిన రమేష్ ను అదే గ్రామానికి చెందిన అశోక్ మరికొందరు కత్తితో గొంతు కోసి చంపడం జరిగిందన్నారు. ఈ కేసు కు సంబంధించి అశోక్, వెంకటపతి ,తలారి మద్దిలేటి అనే వ్యక్తులను ఈరోజు ఉదయం చిన్న కంబలూరు సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద అరెస్టు చేసి హత్యాయుధాలు, మోటార్ బైక్, ఆటో, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. మీడియా సమావేశంలో సిరివెళ్ల సిఐ దస్తగిరి బాబు, రుద్రవరం ఎస్ఐ వరప్రసాద్ పాల్గొన్నారు.