శ్రీరాముని రాజ్యం…నంద్యాలలో రావాలి..బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు

♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

⇔ఇది అభివృద్ధి కాదా…శిల్పా ఇదా నీ అభివృద్ధి.
⇔శిలా ఫలకాలకు సోకులు చేయడమేనా అబివృద్ది

శ్రీరాముని రాజ్యం నంద్యాల లో రావాలని బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పిలుపునిచ్చారు… బిజెపి ఇంటింటి ప్రచారంలో భాగంగా విశ్వ నగర్ లో ప్రచారం నిర్వహించారు.ఇంటింటా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ నగర్లో ఎన్నో సమస్యలు వున్నాయని అన్నారు.శ్రీరాముని రాజ్యం నంద్యాలలో వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.ఈ ప్రాంతంలో ఓ వృద్ధురాలు  ఇంటికి లోన్ ఇస్తామని చెప్పి,నేటికీ లోన్ రాకపోవడంతో వున్న ఇల్లు మరమత్తులు చేయించుకొలేక పరదాలు కప్పుకొని ఎండకు,వానకు,చలికి ఇబ్బందులు పడుతోందనితన దృష్టికి తీసుకొచ్చిందన్నారు..నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రోజు ఇది అభివృద్ధి కాదా అని పోస్టింగులు పెడుతున్నారని,నీ హయాంలో ఇదేనా  అభివృద్ధి అని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం 50 వేల టిడ్కో గృహాలు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి జగన్ అవి పేదలకు పంచకుండా పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అన్నారు

 

.విశ్వ నగర్లో రోడ్లపై కసువు ఊడ్చేవారు లేరన్నారు.కాల్వల్లో ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందోనని ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు..20 ఏళ్లుగా అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి ఇదేనా అని ఘాటుగా ప్రశ్నించారు.స్వతంత్ర సమరయోధులు,భారత రత్న అవార్డు అందుకున్న అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ శిలాఫలకానికి చుట్టూ వైసిపి రంగులు వేసుకొని నాలుగు వైపులా శిల్పా అని పేరుపెట్టి సోకులు చేసుకోవడమే తప్ప అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.రాష్ట్రం అభివృద్ది చెందాలంటే బిజెపి ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి రెడ్డి,స్వాతి,ఉపేంద్ర రెడ్డి,గురు బ్రహ్మ,వంశీ ,రామకృష్ణా రెడ్డి,ప్రకాష్ గౌడ్,మద్దిలేటి,మదు రామ్, వాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *