రిపోర్టర్ రఘునాదరెడ్డి బనగానపల్లె
బనగానపల్లె జనవరి 7 (ప్రజాన్యూస్)
*క్లాట్ లో ప్రతిభ చూపిన గోరుకల్లు అమ్మాయి యాపమాను విజయలక్ష్మి
* ప్రముఖ జాతీయ లా యూనివర్సిటీలో సీటు కేటాయింపు

పాణ్యం: పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన యాపమాను పెద్దస్వామి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె విజయలక్ష్మి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ ) CLAT 2026 లో మంచి ర్యాంక్ సాధించి విశాఖపట్నం లోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (DSNLU)లో సీట్ పొందింది. తండ్రి పెద్దస్వామి నంద్యాల లో అడ్వకేట్ గా, తల్లి లక్ష్మీదేవి నంద్యాల లో వీఆర్వో గా పనిచేస్తున్నారు. విజయలక్ష్మి హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఎన్ టీ ఆర్ జూనియర్ కాలేజీ లో MEC చదువుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 500 కు 493 మార్కులు సాధించి కాలేజీ టాపర్ గా నిలిచింది. క్లాట్ పరీక్ష రాసి ఆల్ ఇండియా ర్యాంక్ 4808, ఆల్ ఇండియా ఓబీసీ ర్యాంక్ 699, ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ర్యాంక్ 61, ఉమెన్ కేటగిరీ ర్యాంక్ 38 సాధించి నేషనల్ లా కాలేజీ లో సీట్ పొందింది..
ఇంటర్ లో మంచి మార్కులు సాధించడం తో పాటు క్లాట్ 2026 లో మంచి ర్యాంక్ రావడం తో విజయలక్ష్మీ ని నారా భువనేశ్వరి అభినందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ లో అభినందిస్తూ పోస్ట్ చేశారు. క్లాట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి విశాఖపట్నం నేషనల్ లా యూనివర్సిటీలో సీటు పొందడంతో గోరుకల్లు గ్రామస్తులు, నంద్యాల న్యాయవాదులు పలువురు అభినందించారు