ఆళ్ళగడ్డ నవంబరు 6 (ప్రజాన్యూస్): పేదలకు ఉచిత న్యాయంఅందించేందుకుఉద్దేశించినన్యాయసేవాసంఘం అద్వెర్యంలో నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులు సత్పలితాలు ఇస్తున్నాయి.. ఈమేరకున్యాయసేవాసంఘం అద్వెర్యంలో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం ఓబులంపల్లె గ్రామంలో న్యాయ సేవా సంఘం అద్వెర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది
.ఈ కార్యక్రమాానికి ముఖ్య అతిధిగా జిల్లా న్యాయ మూర్తి అమ్మనరాజ హాజరయ్యారు.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు పలురకాలన్యాయపరమైనఅంశాలనుప్రజలకువివరించారు..భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు,హక్కుల ఉల్లంఘన జరిగితే చట్టపరంగా,న్యాయపరంగా పౌరులు న్యాయం ఎలా పొందవచ్చు అన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు..అనంతరం జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజ మాట్లాడుతూ ప్రజలు చట్టలపైన అవగాహన కలిగి ఉండాలన్నారు..తమకు చట్ట విరుద్ధంగా ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం ఎలా పొందలో తెలుసుకో వాలన్నారు.ఏదేని అన్యాయం జరిగినప్పుడు భాదితులు తమ కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదని,కోర్టు ద్వారా న్యాయం పొందాలంటే ఆర్థిక స్తోమత లేదని అన్యాయానికి బలి కావాల్సిన అవసరం లేదన్నారు.న్యాయ సేవా సంఘము ద్వారా పేదలు ఉచితంగా న్యాయ సహాయము పొందవచ్చు అన్నారు..కార్యక్రమంలోఎజిపిసడ్రక్,ఎపిపిలు, న్యాయవాదులు రమణయ్య,నీలకంఠం,శివప్రసాదరావు మురళీ, నరసింహారెడ్డి ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు