ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 06అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు ఫిర్యాదిదారుల నుంచి 60 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూసుకోవాలని,ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఆదేశించారు.