ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 08 (ప్రజాన్యూస్)
కూటమి ప్రభుత్వం ప్రజల్లో తమ పనితీరుపై రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ప్రజాప్రతినిదుల పనితీరుపై ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డు సిస్టం తో సర్వే నిర్వహించడం ఏడాదిగా జరుగుతోంది…సర్వేలో పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిదులకు ముఖ్యమంత్రి క్లాస్ కూడా తీసుకున్న సందర్బాలు ఉన్నాయి..దాదాపు ప్రతి మూడునెలలకు ఒకసారి ఈ సర్వే నిర్వహించి ప్రజల్లో తమకున్న పాజిటివిటి ,నెగటివిటిని ముఖ్యమంత్రి చంద్రబాబు,ఐటి మంత్రి లోకేష్ అంచనా వేస్తుంటారు..ఈ ప్రక్రియ గతంలో టిడిపి అదికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది..ఒక నేతకు పదవి కట్టబెట్టాలన్న ఎన్నికలలో టికెట్లు ఇవ్వాలన్నా ఈ విదానాన్నిముఖ్యమంత్రి పాలో అవుతారు.
.అయితే నేడు వినూత్నంగా అదికారుల పనితీరుపై కూడా ఐవి ఆర్ ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటోంది..తాజాగా మంగళగిరి నుండి జిల్లా కలెక్టర్ల పనితీరుపై ప్రజలనుండి అభిప్రాయలను ఐవిఆర్ ఆస్ ద్వారా ప్రభుత్వం సేకరించింది..ఈమేరకు నంద్యాలజిల్లా కలెక్టరు రాజకుమారి గణియా పనితీరుపై మంగళగిరి నుండి ఐవి ఆర్ ఆస్ నిర్వహించారు..ఈ సర్వేలో కలెక్టరు పనితీరుపై జిల్లా ప్రజలు జయహో రాజకుమారి అంటూ జేజేలు పలికినట్లు సమాచారం..ఈమేరకు ప్రజాటివి ప్రజలనుండి సమాచారం సేకరించగా కలెక్టరు పనితీరుపై ఐవిఆర్ ఎస్ సర్వే జరిగిందని ఆమె పనితీరు బాగుందని బటన్ నొక్కినట్లు తెలిపారు..కలెక్టరుగా రాజకుమారి బాద్యతలు తీసుకున్నాక పేదలసంక్షేమం కోసు పాటుపడుతోందని,ప్రభుత్వ సంక్షేమకార్యక్రమాలు ప్రజలకు దగ్గరగా తెచ్చేందుకు తనదైన శైలిలో కృషిచేస్తోందన్నారు..గతంలో కలెక్టరున కలవాలంటే ఎంతో కష్టంగా ఉండేదని, ఈమె సమస్యలకోసం వచ్చే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు..ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమస్య వస్తే వ్యక్తగత శ్రద్దతో ప్రజల సమస్యలను తీరుస్తోందని ప్రశంసించారు..జిల్లాను అబివృద్ది బాటలో నడిపేందుకు ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయమని ప్రజాటివికి ప్రజలు వివరించారు..ఇలాంటి కలెక్టరును ఎక్కువకాలం జిల్లాలో కొనసాగిస్తే జిల్లా అన్నివిదాల అబివృద్ది చెందుతున్నారు..ఏదిఏమైన ప్రజా సర్వేలో కలెక్టరు రాజకుమారి జయహో రాజకుమారి అంటూ కీర్తించబడింది.హేట్స్ ఆప్ టు యు కలెక్టరు గారు..