!!ఎన్నికలు …మీడియా పాత్ర.. ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఇలాచేస్తే సరి!!

♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

గత దశాబ్దకాలంలో మీడియాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి..ప్రింట్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా అనేక మార్పులతో రూపాంతరం చెందాయి..ఎలక్ట్రానిక్ మీడియాలో డిజిటల్ మీడియా ప్రాముఖ్యత పెరిగిపోతోంది…ఏదేని మీడియా ఇంటర్ నెట్ సహాయంతో నడిపించే ప్రతి మీడియా డిజిటల్ మీడియా పరిదిలోకి వస్తుంది..శాటిలైట్ మీడియా, కేబుల్ మీడియా వీటికి అదనం..డిజిటల్ మీడియా పరిదిలోకి బ్లాగ్లు, వెబ్ సైట్లు, వాట్స్ అప్, పేస్ బుక్, ఇంస్ట్రాగ్రామ్, యూట్యూబ్ లాంటి వి .,.వీటిని సోషల్ మీడియా అని కూడా పిలుస్తారు..ఇది క్లుప్తంగా ఆదునిక మీడియా స్వరూపం..

అయితే ఇంటర్ నెట్ విస్త్రతంగా వ్యాప్తిచెందడంతో సెల్ పోన్ లోనే అన్ని డిజిటల్ మీడియాలు నడిపించే పరిస్తితి వచ్చేసింది…దీంతో ఔత్సాహిక యువకలు ఈ రంగాన్ని ఎంచుకున్నారు..అయితే ఈ రంగం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తో పోలిస్తే తప్పుదారిన పోతోందని పలువురి ఆందోళన..ప్రింట్ మీడియాకి ఆర్ ఎన్ ఐ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ మరియు కేబుల్ మీడియాకు బ్రాడ్ కాస్టింగ్ రెగ్యులేషన్స్ ఉంటాయి..సోెషియల్ మీడియాకు ఏం రెగ్యులేషన్ ఉండదు..ఎవరి ఇష్టం వచ్చినట్లు వార్తలు వ్రాసే పరిస్థితి నెలకొంది..

అయితే భారత ప్రజాస్వామ్య వ్వవస్థలో మీడియా పోర్త్ ఎస్టేట్ అయినప్పటికి వారికి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికి రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఎవరి వ్యక్తిగత స్వేచ్చను హరించే హక్కు మీడియాకు ఉండదు.అలాగే మీడియా బావ ప్రకటన స్వేచ్చను కూడా ఎవరూ అడ్డుకోలేరు..ఈరెండింటి మద్య సమతుల్యత ను మీడియా ప్రతినిదులు మీడియా సంస్ధలు చేసుకోవాలి..పౌరుల హక్కుల భంగానికి, రాజ్యాంగ సూత్రాలకు మీడియా పాత్రదారి కాకూడదు..

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్నికల సీజనలో భారతదేశం ఉంది..దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు కొన్నిచోట్ల, సార్వత్రిక ఎన్నికలు కొన్నిచోట్ల జరుగుతున్నాయి..ఈ ఎన్నికలలో మీడియా పాత్ర అతి ప్రదాన మైనది..మీడియా వ్యవహారశైలి పై ఎన్నో  విమర్శల నేపద్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం మీడియాకు కూడా ఈ సమయంలో కొన్ని పరిదులు విదించింది..ఈమేరకు భారత ఎన్నికల సంఘం ఈ పరిదిలోనే మీడియా ఉండాలి ఉన్న ఉద్దేశ్యంతో కొన్ని నిబందనలు మీడియాకు విదించింది….

వివరాలలోకి వెళితే మీడియాను మంచికి వాడొచ్చు చెడుకు వాడొచ్చు..మీడియాను అడ్డదారిలో వాడేందుకు దనాన్ని ఎరగా చూపి పెయిడ్ ఆర్డికల్స్ వ్రాసుకోవచ్చు..దనం ఉన్నవాడు ఈపనిచేస్తాడు..ప్రజల్లోకి తన వాయిస్ ను బలంగా మంచిగాని చెడుగాని పంపిస్తాడు..డబ్బు లేని వాడు ఏంచేయాలి..దీనికోసం భారత ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో మీడియా మంచి మార్గంలో వెళ్లేందుకు కొన్ని మార్గదర్శకాలను విదిగా పాటించాలని సూచించింది..

ఎన్నికల సమయంలో పౌరులైనా ,అదికారులైనా, ప్రజాప్రతినిదులు అయినా ,మీడియా రంగం అయినా ఎన్నికల కమీషన్ పరిదిలో పనిచేయాల్సిందే..ఎన్నికల కమీషన్ సూచించిన మార్గదర్శకాలు పై అన్ని వర్గాలు తుచ తప్పకుండా పాటించాల్సిందే..ఎన్నికల కమీషన్ అంటే మనజిల్లా యంత్రాంగమే కదా లేదా మనకు పరిచయం ఉన్న అదికారులే కదా అంటూ భావించడం తప్పు..ఎన్నికల సమయంలో ప్రతి అదికారిలో ఓ అపరిచితుడు ఉంటాడు..ఆ అపరిచితుడు దేశ ఎన్నికల కమీషన్ పరిదిలోనే ఉంటాడు తప్ప తాను స్థానికి అదికారి అని భావించడు.ఒక వేళ ఆ అదికారి అలా భావించి అదికారి తప్పులు చేస్తే ఇంతపెద్ద వ్యవస్థలో ఎక్కడో ఒక చోట ఎన్నికల కమీషన్ ఆగ్రహానికి గురి కావల్సిందే..అందుకే ఎన్నికల కమీషన్ అదికారులు మనకు తెలిసిన వారే అని భావించి పౌరులు ప్రజాప్రతినిదులు అదికారులు మీడియా తప్పు చేస్తే ఎక్కడో ఒక చోట కమీషన్ ఆగ్రహానికి గురి కావల్సిందే..

ఎన్నికలకమీషన్ ఆదేశాలు పాటించక పోతే ఏమౌతుంది..

ఉదాహరణకు ప్రజాప్రతినిది తనకు నిర్ణయించిన ఖర్చులోపు ఎన్నికల కమీషన్ ఆదేశాలను పాటించకపోతే ఆఖర్చు దాటాక ఆ ప్రతినిదిని పోటీచేసే హక్కునుండి కూడా కమీషన్ తప్పించవచ్చు..ఎన్నికల కమీషన్ నిర్ణయాలను దాదాపుగా భారత అత్యుత్తమ న్యాయస్థానం కూడా కల్పించుకోక పోవచ్చు..ఎంతో ఘోరమైన తప్పిదం జరిగితే తప్ప ఎక్కువ శాతం కోర్టులు ఎన్నికల కమీషన్ నిర్ణయాలలో తల దూర్చక పోవచ్చు..మీడియా పరిస్తితి కూడా అంతే..హద్దు దాటి అతిగా ప్రవర్తిస్తే మీాడియా సంస్ధను సీజ్ చేసే అవకాశం కూడా ఎన్నికల కమీషన్ కు ఉంటుంది..అదికారులు సైతం ఏదో పార్టీకి వత్తాసు పలుకుతూ ఎన్నికల కమీషన్ నిబందనలకు విరుద్దంగా పక్షపాతంగా వ్యవహరిస్తే ఎన్నికల తరుణంలో కమీషన్ ఆగ్రహానికి గురికావాల్సిందే..ఆ సమయంలో ఆ అదికారి తన ఉద్యోగ జీవితంలో పొందవలసిన పలు ప్రయోజనాలను సైతం ఎన్నికల కమీషన్ గీసే ఎర్రగీతతో జీవితకాలం కోల్పోయే ప్రమాదం ఉంది..మరీ పెద్ద తప్పులుచేస్తే సస్పెషన్ అవసరమయితే సర్వీసునుండి తొలగించే విస్త్రత అదికారాలు కూడా ఎన్నికల కమీషన్ కు ఉంటాయి..

ముఖ్యంగా ఎన్నిాకలలో మీడియా చేస్తున్న తప్పులేంటి

మీడియా రంగంలోకి రాజకీయ నాయకులు ప్రవేశించడంతో రాజకీయపార్టీలు స్వంతంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషయల్ మీడియా రంగంలోకి వచ్చేశారు..దాదాపుగా స్వతంత్ర మీడియా లేదు..ఈ పరిస్తితులలో మీడియాలో విచ్చలవిడితనం వచ్చేసింది..తమ స్వంత చానళ్లు పేపర్లు సోషయల్ మీడియాలలో ఎదుటివారిని దూషించడం, అతిగా ప్రమోట్ చేసుకోవడం, అసత్యాలు ప్రచారం చేయడం జరుగుతున్నాయి..వీటిని నియంత్రించేందుకు ఎన్నికల కమీషన్ మీడియా సర్టిపికేషన్ అండ్ మోనటరింగ్ (MCMC)కమిటీ ని నియమించింది..ఈకమిటీ ఆద్వర్యంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానికి్ మీడియాలో పెయిడ్ న్యూస్ ని గుర్తించడం మత జాతి కుల విద్వేషాలను రెచ్చగొట్టే వార్తలను ప్రసారాలను గుర్తించేందుకు వాటిని ముందుగానే నియంత్రించేందుకు ప్రి సర్టిపికేషన్ తప్పనిసరి చేసింది..ప్రింట్ మీడియాకి అయితే ప్రి సర్టిపికేషన్  పోలింగ్ రోజుకు రెండు రోజుల ముందు అవసరం అయితే ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియాకి ముందస్తు అనుమతి తప్పనిసరిచేసింది ఎన్నికలసంఘం. 

ఎంసి ఎంసి నిబందనలు ఏంటి

ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ సోషల్ మీడియా యావత్తు వీరి నిబందనలు పాటించాల్సిందే..ప్రింట్ మీడియావారు ఏవార్తనైనా పెయిడ్ న్యూస్ గా వ్రాస్తే ఆవార్త పూర్వాపరాలు పెయిడ్ న్యూస్ గా అనిపిస్తే ఆవార్త నిడివి ప్రకటనగా పరిగణిస్తారు..ఈవార్త రూపంలో ఉన్న పెయిడ్ న్యూస్ విలువ లెక్కకట్టి అభ్యర్తి ఖాతాలో వేస్తారు..అభ్యర్తి నాకు సంబందంలేదని చెబితే పబ్లిషర్ బాద్యులు అవుతారు..కావున అబ్యర్ధి దగ్గర కంసెంట్ తీసుకున్నాకే మీడియా ప్రకటనలు ఇవ్వాలి..ఇక పోలింగుకు ముందు రెండురోజులలో ప్రింట్ మీడియాలో ప్రకటన ఇవ్వాలంటే ప్రకటన సైజు ఏఏ ప్రాంతాలలో ప్రకటన వేస్తారు.వాటి విలువతో ఎంసి ఎంసి కమిటీకి దరఖాస్తు చేయాలి..ప్రకటనలో ఎలాంటి రెచ్చగొట్టే అంశం దూషించిన అంశాలు ఎదుటివారి పైఅసత్య ప్రకటనలు లేకుంటే ప్రకటన ప్రకటించవచ్చు అందుకు అనుమతి తప్పనిసరి..అయితే ఈ ప్రకటన ఖర్చును మాత్రం అభ్యర్ధి ఖాతాలో వేస్తారు..వార్తలలో స్పాట్ వార్త అయితే పెయిడ్ న్యూస్ క్రిందకి రాదు..వార్తలో పొగడ్తలు అతిశయోక్తులు ఆహా..ఓహో అహోఘం అపూర్వం..ఘనంగా లాంటి పదాలతో వార్తను విలేకరి తానే స్వయంగా చెబుతూ వ్రాసిన వార్తలు పెయిడ్ న్యూస్ అవుతాయి…అలాగే వార్తలో ఎదుటివారిని దూషిస్తూ కించపరుస్తూ అబ్యర్తి చేసిన ప్రకటనను అలాగే ఇస్తే ఇది మోడల్ కోడ్ ఆప్ కాంటాక్ట్ క్రిందికి వస్తుంది..ఇదికూడా ఇబ్బందికరమే..అందుకే ప్రతినిదులు ఏదైనా వాడరాని భాష వాడితే దానిని యదాతదంగా ప్రచురించరాదు..అలాగే ఎలక్ట్రానికి డిజటల్ మీడియా సోషియల్ మీడియా అయితే స్పాట్ వార్తలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.అలాగని ప్రతినిదులు ఇస్టానుసారం నిరాదార అంశాలను మాట్లాడితే ఈ వార్త ఇవ్వకపోవడమే మంచిది..లేదా ఎఢిట్ చేసి ఇవ్వడం మంచిది..అలాగే స్పాట్ వార్తకు అతిశయోక్తి పొగడ్తలు జోడించి పాటలు పెట్టడం నిబందనలకు విరుద్దం..పాటలు పెడితే ఆ పాటను ఎంసి ఎంసి కి ఇచ్చి ప్రీ సర్టిపికేషన్ పొందాలి..ఆ పాాటను ఏఏ మీడియాలో ప్రసారం చేస్తారో తెలపాలి..అలాగే వాటికి అయ్యే ఖర్చును వివరించాలి..అభ్యర్ధి లేదా ప్రకటనదారుడి అంగీకారం పత్రం మీడియా వారి వద్ద ఉండాలి..అలాగే అభ్యర్తి తనపై ఘనంగా ఓపాటను తయారుచేసుకుని సోషయల్ మీడియాలో వేసుకుంటే దానిని ఎవరైనా పార్ వర్డ్ చేస్తే అభ్యర్తి అంగీకారంతో పాటుగా ఎంసి ఎంసి అనుమతిలో కనబరిచిన మీడియాలో మాత్రమే ప్రసారం చేస్తే సరి..అది అభ్యుర్ధికి ఖర్చకి వ్రాస్తారు.ఇలాంటివి ఏమీలేకుండా పాటను ప్రసారం తమ వాట్పాప్ గ్రూపుల్లో వేస్తే వ్యక్గి గతంగా గ్రూపు అడ్మిన్ పోస్టు చేసిన వారు భాద్యులు అవుతారు..కావున ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియావారు ఇలాంటివి చేయడం మానివేయడం మేలు..లేకపోతే అపిషియల్ గా అనుమతి తీసుకుని ఎన్నికల కమీషన్ ఆగ్రహానికి గురి కాకుండా ఉండవచ్చు

ఎవరూ గమనించరులే అనుకుంటే ప్రమాదమే

గ్లోబలైజేషన్ డిజిటలైజేషన్ పుణ్యమా అని రెండు దశాబ్దాలనాటి పరిస్థితి ఇప్పుడు లేదు..గతంలో ప్రింట్ మీడియాలో ఒక ప్రాంతంలో వచ్చిన వార్తను మరో ప్రాంతంలో చూసే పరిస్తితిలేదు.అలాగే ఎలక్ట్రానిక్ మీాడియాలో ఎవరైనా టివిచూస్తే తప్ప తెలిసేదికాదు..ఇప్పుడు సోషయల్ మీడియా పుణ్యమా అని మెయిన్ మీడియా స్ట్రీ చానల్స్ సోషయల్ మీడియా చానల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా చూడవచ్చు..ప్రింట్ మీడియాను సైతం ఏప్రాంత వార్తనైనా చూడవచ్చు..కావున పౌరులు మీడియా ప్రతినిదులు సోషయల్ మీడియా ప్రతినిదులు ప్రజాప్రతినిదులు ఎన్నికల అదికారి మాకు తెలిసిన వాడనో లేదా మా ప్రభుత్వం అదికారంలోకి వస్తే ఆ అదికారి మళ్లీ మన క్రిందే పనిచేస్తాడుగా మనని ఏం చేస్తాడులే అనుకోవడానికి వీలులేదు.ఈవార్తను ఈ ఉల్లంఘనను దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఏ అదికారైనా చూడవచ్చు..భాదితులు గల్లీ నుండి డిల్లీ వరకు ఎక్కడికైనా పిర్యాదు ఆదారాలతో చేయవచ్చు..అప్పడు మనవాడు మనవాడు కాదు..ఏ పక్కరాష్ట్రంనుండివచ్చిన అదిాకారో కమీషన్ నిబందనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు వ్రాసి సంతకంచేసి వెళ్లిపోయాడంటే మనం డిల్లీ వరకు తిరగాల్సిన పరిస్థితి రావచ్చు..ఎన్నికల కమీషన్ ఇఫ్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో మానిటరింగ్ కోసం నిష్టాతులైన వారిని నియమించి ప్రతిరోజు ప్రింట్ ఎలక్ట్రానికి్ సోషయల్ మీడియాను మానటరింగ్ చేస్తోంది..

కమీషన్ నిబందనలు పాటిద్దాం సమస్యలను కొనితెచ్చుకోకుండా ఉందాం..

కాబట్టి ఈరెండు నెలలు ఏపార్టీకి పనిచేసే విలేకరులైనా మీడియా హౌస్ వారైనా ఎన్నికల నిబందనలు పాటిాంచడమే మేలు.అలాగే రాజకీయ నాయకలు సైతం సంయమనంపాటించడం మేలు..ఖర్చు మీరి పెట్టారని ఆపీసర్ రాస్తే మీరు పోటీకి కూడా అర్హులు కాకపోవచ్చు..కమీషన్ నిబందనల మేరకు ముఖ్యంగా ఎలక్ట్రానికి్ డిజటల్ మీడియా సోషల్ మీడియా ఎన్నికల కమీషన్ అనుమతితో చేయవలసిన పనులు చేసి ప్రసారాలు చేస్తే మంచిది…మీరు ఈసమయంలోనే డబ్బులు వస్తాయని మాబ్రతుకు తెరువు ఎలాగు అంటే నిబందనల మేరకు అనుమతితో ఎన్ని ప్రకటనలు అయిన వేసుకోండి..అభ్యర్ది ఖర్చుకు కేటాయించిన మొత్తంలో సగం ప్రకటనలకే అఫిషియల్ ఖర్చు చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదన్న విషయం గుర్తించండి…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *