ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి.
మహానంది. మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ తో పాటు, జడ్పీ హైస్కూల్ ను నంద్యాల జిల్లా డి ఈ ఓ సుధాకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రెండు కేంద్రాల్లో జరగనున్నాయి. అందులో భాగంగానే పరిశీలించి పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎంఈఓ రామసుబ్బయ్యను ఆదేశించారు. ఆయన వెంట ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు, సి ఆర్ పి తిమ్మయ్య తదితరులు ఉన్నారు.