టిడిపిలో కాకరేపుతున్న శ్రీశైలం ట్రస్టుబోర్డు డైరెక్టర్ల నియామకం

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 05అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :

కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన శ్రీశైలం ట్రస్టుబోర్డు డైరెక్టర్ల నియామకం నంద్యాలజిల్లా తెలుగుదేశం పార్టీలో కాకరేపుతోంది..కష్టపడిన వారికి పదవులు దక్కుతాయి అంటూ టిడిపి అదిాష్టానం పలు మార్లు ప్రకటిస్తున్నప్పటికి అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో జరగడంలేదని తెలుగుతమ్ముళ్లు బహిరంగంగా విమర్శిస్తున్నారు..ఎన్టి ఆర్ హయాంనుండి లోకేష్ హయాం వరకు పార్టీకోసం కష్టపడిన అనేక మందిని కాదని పార్టీఅంతమే తమ పంతంగా పనిచేసిన పార్టీ వ్యతిరేకులకు కూడా పదవులు రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు..

ఇటీవల శ్రీశైలం ట్రస్టు బోర్డు డైరెక్టర్ల నియామకంలో బిజెపి పార్టీనుండి మేడా మురళికి నంద్యాలనుంచి చోటు దక్కగా పట్టణానికి చెందిన ఆర్దో వైద్యులు డాక్టర్ జగన్ మోహనరెడ్డి సతీమణి డాక్టర్ సిందూశ్రీకి డైరెక్టరుగా చోటుదక్కింది..అయితే ఇక్కడే ఈమె నియామకం పట్ల తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు..గతంలో డాక్టర్ సింధుశ్రీకి కనీసం పార్టీ సభ్యత్వంకూడాలేదని పైగా ఇటీవల ఎవరైనా కె ఎస్ ఎస్ లో నమోదు అయితేనే పార్టీనుండి పదవులు అందుతాయని ప్రకటించిన అదిష్టానం సిందూశ్రీ విషయంలో ఎందుకు నిబందనలు పాటించలేదని ప్రశ్నిస్తున్నారు..పదవి బిసిలకే ఇవ్వాలంటే దశాబ్దాలనుండి పార్టీకి పడిగాపులు పడి పార్టీ జెండా మోసిన బిసి నేతలు ఎవి ఆర్ ప్రసాద్,జిల్లెల్ల శ్రీరాములు, నాయుుడుతో పాటుగా పలువురు బిసినేతలు పార్టీకి జెండా మోసారని వారు గుర్తు చేస్తున్నారు…ఇక ఓసిల విషయానికి వస్తే పార్టీ కి అత్యంత వీర విధేయులైన ఎంతో మంది జిల్లా వ్యాప్తంగా ఉన్నారు..ఆల్లగడ్డ నియోజకవర్గంలో పార్టీకోసం అహర్నిశలు పాటుపడిన కాకర్ల రమేష్ చౌదరి తోపాటుగా శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన కంచర్ల సురేష్ రెడ్డి పార్టీకి వీర విదేయులే..ఇక వైశ్య, బలిజ సామాజిక వర్గాలు రెడ్డి సామాజిక వర్గాలలో కూడా టిడిపి పార్టీ ప్రారంభంనుండి జెండా మోసిన ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు..

ఇక శ్రీశైలం ట్రస్టు బోర్డు మెంబరుగా ఎంపికయిన దేవకి వెంకటేశ్వర్లు ఏ పార్టీ అదికారంలో ఉంటే ఆపార్టీలోకి వెళ్లి పదవులు పొందుతున్నారని అలాంటి వారికి చోటిస్తే నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటని కూటమి పార్టీల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు..దేవకి వెంకటేశ్వర్లు 2014 నుండి 2019 వరకు టిడిపి అదికారంలో ఉంటే టిడిపిలో.2019 నుండి 2024 వరకు వైసిపి అదికారంలో ఉంటే వైసిపిలో ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన పార్టీలో ఉండి పదవి పొందడం పట్ల పదవులు ఎవరికి ఎలా అందుతున్నాయో అంతుచిక్కడంలేదని కూటమి కార్యకర్తలు వాపోతున్నారు..ఇక నంద్యాల జిల్లాలో వైసిపి పార్టీ అయినా కూటమి వ్యతిరేకులైనా జిల్లాలోని ఓమంత్రికి బందువుకావడమో ఆయనకు సన్నిహితులుగా ఉంటే సరిపోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.,..

జిల్లాలో మంత్రులు పనితీరు కార్తకర్తల కోసం లేదని ఏ పార్టీ వారైనా వారికి అనుకూలంగా ఉంటే కార్యకర్తలను విస్మరించి పార్టీని విస్మరించి అన్ని పనులు చక్కబెడుతున్నారని కూటమి నేతలు కార్యకర్తలు వాపోతున్నారు.. ఈవిషయం అదిష్టానం గుర్తంచకపోతే జిల్లా వ్యాప్తంగా టిడిపి తో పాటు కూటమి పార్టీలకు నష్టం తీవ్రంగా ఉంటుందని పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలు అదిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు..సిందుశ్రీ నియామకంపై ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే పార్టీ అదిష్టానానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది..పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ఈ మెయిల్లకు కూడా వారు సిందూశ్రీ నాయామకంపై పిర్యాదుచేసినట్లు సమాచారం.. సిందూశ్రీ విషయంలో పార్టీ పునరాలించుకోకపోతే పార్టీ విదానం ఇదేనని పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చి రాబోయే స్థానిక సంస్దలలో తీవ్ర నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *