ప్రజాటివి ప్రతినిది ఎ.శ్రీనివాసులు ఆళ్లగడ్డ
గాయత్రీ దేవి అలంకారంలో వాసవి మాత
ఆళ్ళగడ్డ , అక్టోబర్ 5
ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం రాత్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా ప్రతినిత్యం ఒక అలంకారం చొప్పున అమ్మవారికి నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని అంబూరు కు చెందిన అలంకార స్వామి సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో మూడవరోజు ఉత్సవాలలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శ్రీ గాయత్రీ మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అలంకార మండపంలో కొలువు తీర్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న రాదా మనోహర్ దాసు ప్రసంగం
ఆళ్లగడ్డ అమ్మవారి శాలలో ఇస్కాన్ హైందవ సింహం రాధా మనోహర్ దాస్ హాజరై భక్తులకు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. హిందువులు ఆచరించవలసిన విధానాలపై తదితర అంశాలపై ఆయన చక్కని ప్రసంగం ప్రసంగం చేశారు