నంద్యాల,ఆగస్టు5(ప్రజాన్యూస్)
✤కోర్టు ఉత్తర్వులతో మార్కెటు కమిటీకి మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్సు అదికారాలు
✤త్వరలో శిల్పా సహకార్ తోసహా షాపింగ్ కాంప్లెక్సుస్వాదీనానికి మార్కెట్ యార్డు కమిటీ ఏర్పాట్లు
✤మంత్రి ఆదేశాలతో తదుపరిచర్యలకు సిద్దమయిన మార్కెట్ యార్డు కమిటీ
అధికారాన్ని అడ్డుపెట్టుకుని 15 ఏళ్లపాటు సేవపేరుతో రైతుల సొమ్మును అప్పనంగా స్వాహాచేసిన శిల్పా కుటుంబం నంద్యాల రైతులకు క్షమాపణ చెప్పాలని మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు డిమాండ్ చేశారు..మంగళవారం మార్కెట్ యార్డు కార్యాలయంలో సొసైటీ అద్యక్షులు, మార్కెట్ యార్డు కమిటీ మెంబర్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు..ఈసందర్బంగా హరిబాబు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా సేవపేరుతో అదికారాన్ని అడ్డుపెట్టుకునిశిల్పా కుటుంబం యార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్సులో రూములను కారు చౌకగా పొందారన్నారు..ఒక్కొక్క రూముకు 920 రూపాయలనుండి 2700 రూపాయల వరకు నేటి వరకు చెల్లించారని వాస్తవంగా పక్కనే మరో వ్యక్తికి ఇచ్చిన షాపు ఈ రూం అద్దెకు నాలుగు రెట్లు ఉందన్నారు..గత15 ఏళ్లుగా దాదాపు రూ.5కోట్ల రూపాయల మేర రైతులకు చేరవలసిన మార్కెటు యార్డు సొమ్మును శిల్పా కుటుంబం అనుభవించిందన్నారు..శిల్పా లీజు గడువు ముగియడంతో నోటీసులు అందించామని అయితే వారు హైకోర్టును ఆశ్రయించి తమకే రూంలు ఇవ్వాలని కోరారన్నారు..అయితే గౌరవ న్యాయస్థానం ఈవిషయంపై విఃచారణ జరిపి రూంలు అద్దెకు ఇచ్చే ప్రక్రియలో మార్కెట్ యార్డు కమిటీకే సర్వాదికారాలు కట్టబెడుతూ తీర్పు ఇచ్చిందన్నారు..గౌరవన్యాయస్థానం తీర్పు మేరకు త్వరలో మంత్రి ఎన్ ఎండి పరూఖ్ ఆద్వర్యంలో మార్కెట్ యార్డు కమిటీ నిర్ణయం తీసుకుని కారుచౌకగా శిల్పా కుటుంబం తీసుకున్న రూం లను స్వాదీనంచేసుకుంటామన్నారు..సేవపేరుతో రైతుల సొమ్ముకు గండికొట్టేబదులు మాజీ ఎంఎల్ఎ కి రైతునగరం ప్రాంతంలో పొలాలు ఉన్నాయని వాటిలో షాపింగ్ నిర్వహించి లేదా మరో ప్రాంతంలో అద్దెకు తీసుకుని సేవ చేయాలని ఈసందర్బంగా మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాజీ ఎంఎల్ ఎ శిల్పాకు సూచించారు..