నంద్యాల జులై 5 (ప్రజా న్యూస్): స్పందన కార్యక్రమానికి అందిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తాం అని నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ అన్నారు
సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్. సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి హరినాథ్ రావు లతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు
అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూస్పందన కార్యక్రమం లో భాగంగా నంద్యాల రెవెన్యూ డివిజన్ నలుమూలల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించామన్నారు
నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని 17 మండలాల తహసిల్దార్ వారి కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేశారని సచివాలయం నుండి కూడా దరఖాస్తులు స్వీకరించబడు తాయి అని అన్నారు దరఖాస్తు దారులు సచివాలయాల్లో. తహసీల్దార్ కార్యాలయాల్లో. సమస్యలు పరిష్కారం కానప్పుడు రెవిన్యూ డివిజనల్ ఆఫీసు కు రావాలన్నారు ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమం లో ఎక్కువ శాతం భూముల సర్వే చేయించాలని. భూములను ఆక్రమించారని. భూములు ఆన్లైన్లో నమోదు చేయించాలని కోరుతు దరఖాస్తులు అందాయన్నారు ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమానికి 12 దరఖాస్తులు అందినట్లుఆమె తెలిపారు