ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
నంద్యాల.. డిశెంబరు 4(ప్రజా న్యూస్): సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్ విరమణగారి ఆదేశాలమేరకు రాష్ట్రహైకోర్టు జస్టిస్ ఆద్వర్యంలో ఆంద్రప్రదేశ్ లో లీగల్ సర్వీసస్ అధారిటి ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా
న్యాయవాదులు ఇంటింటికి తిరిగి ప్రజలకు న్యాయసేవలపై అవగాహన కల్పిస్తున్నారు,,
ఈకార్యక్రమంలో భాగంగా పా న్ ఇండియా అవేర్ నెస్ అండ్ అవుట్ రిచ్ ప్రోగ్రాం ఆజాదిక అమృత మహోత్సవ్ కార్యక్రమం ఆద్వర్యంలో మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు న్యాయమూర్తి అమ్మన్న రాజా నేతృత్వంలో ప్రజలకు న్యాయవాదులు ఇంటిటికి తిరిగి న్యాయ వి విజ్ఞానం అందిస్తున్నారు…
ఇందులో భాగంగా ఆళ్లగడ్డసబ్ జైలుప్యానెలున్యాయవాదులుబత్తినిశివప్రసాదరావు,రమణయ్య,తిరుపాల్ రెడ్డి శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల,గోస్పాడు మండలంలోని గ్రామాలలో సుడిగాలిపర్యటనచేసి ప్రజలకు ఉచిత న్యాయంపై అవగాహన కల్పించారు..ఈమేరకు శిరివెళ్లమండలంలోనివంకిందిన్నె,గుంపర మాన్ దిన్నె,గోస్పాడు మండలంలోని జీనేపల్లె గ్రామాలలో ఇంటింటికీ తిరిగి మహిళలకు వృద్దులకు యువతకు న్యాయ విజ్ఞానం అందించారు..
ముఖ్యంగా మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిహక్కు పొందడం,గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు.. కన్న పిల్లలు పట్టించుకోపోతే న్యాయపరంగా ముదుసలి తల్లిదండ్రులు తగిన న్యాయం పొందవచ్చు అన్న విషయాలను వివరించారు..భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు,హక్కుల ఉల్లంఘన జరిగితే చట్టపరంగా,న్యాయపరంగా పౌరులు న్యాయం ఎలా పొందవచ్చు అన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు..తమకు చట్ట విరుద్ధంగా ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం ఎలా పొందలో తెలుసుకో వాలన్నారు.ఏదేని అన్యాయం జరిగినప్పుడు భాదితులు తమ కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదని,కోర్టు ద్వారా న్యాయం పొందాలంటే ఆర్థిక స్తోమత లేదని అన్యాయానికి బలి కావాల్సిన అవసరం లేదన్నారు.న్యాయ సేవా సంఘము ద్వారా పేదలు ఉచితంగా న్యాయ సహాయము పొందవచ్చు అన్నారు..న్యాయసహాయం కావలసిని వారు కోర్డువద్దకి వచ్చి న్యాయసేవాసంఘం చైర్మన్ కి అర్జీ వ్రాసి ఇచ్చి వారు కోరుకున్న న్యాయవాది ద్వారా న్యాయసహాయంపొందవచ్చని ,ఈసదవకాశాన్ని ప్రతికక్షదారుడు వినియోగించుకోవాలని న్యాయవాదులు సూచించారు..కాగా న్యాయవాదుల అవగాహన కార్యక్రమాలకు ప్రజలనుండి ఆసక్తితో పాటు స్పందన లభించింది..