నంద్యాల అక్టోబరు 4(, ప్రజా న్యూస్):
నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్దగల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధపూజ జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సుఖశాంతులతో ఉండాలని ఆ దుర్గామాతకు జిల్లా ఎస్పీ శ్రీ కె. రఘువీర్ రెడ్డి పూజలు చేశారు. జిల్లా పోలీసు ఆయుదాగారం మరియు ట్రాన్సుపోర్ట్ విభాగాలలో దుర్గామాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాహనాలకు మరియు ఆయుధాలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో పోలీసు డిపార్ట్మెంట్ మరియు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా పోలీసులు తమ దయనందిన విధులు, సేవలలో విజయాలు చేకూరాలని, ప్రజలతో మమేకమై పోలీసు ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వహించాలని జి ల్లఎస్పి ఆకాంక్షింారు .కార్యక్ర మంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పి అడ్మిన్ రమణ నంద్యాల DSP మహేశ్వర్ రెడ్డి RI లు పోతుల రాజు,RSI లు సోమశేఖర్,దాదాపీరా మరియు పోలీసు సిబ్బంది డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.