ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
నంద్యాల ఆగస్టు4(ప్రజాన్యూస్):నిత్యం ప్రజల్లో వుండే నాయకుడే మనుగడ సాగించే కాలమిది..ప్రజాసమస్యలపై అవగాహన రావాలన్న,,సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవాలన్న ప్రజల చెంతకు వెళితేనే ఆ నాయకుడికి తన పాలనలో లోపాలు తెలుస్తాయి..ఈ నిజాన్ని ఇట్టే పట్టేసాడు ఓ యువ ఎం ఎల్ ఏ ..వివరాలలోకి వెళితే
కర్నూలు జిల్లా నంద్యాల ఎం ఎల్ ఏ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..ఆగస్టు 5 వతేది నుండి తన నియోజక వర్గంలో ప్రజాదర్బార్ పేరుతో ప్రజల చెంత దర్బార్ నిర్వహించనున్నారు..పట్టణంలో ని 42 వార్డులలో ప్రతి వార్డ్ తిరిగి సమస్యలు తెలుసుకుని ఆ వార్డ్ లొనే ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు..అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడే ఉంటారు.. చిన్న చిన్న సమస్య లైతే అక్కడికక్కడే పరిస్కారం చూపనున్నారు.. ఆర్థిక అంశాలతో కూడిన శాశ్వత పరిష్కారం అయితే సమస్యను అధికారులు ప్రణాళికలు వేసుకుని పరిష్కరించేలా ఆదేశాలు జారీ అవుతాయి..ఇవే కాకుండా గత రెండేళ్లుగా వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల తీరు తెన్నులు,సచివాలయ వ్యవస్థ పనితీరు,తదితర అంశాలపై ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.. దీంతో లోటుపాట్లు తెలుస్తాయన్న అభిప్రాయం లో ఎం ఎల్ ఏ శిల్పా ఉన్నారు.ఏడాది పాటుగా కరోనాతో సతమతమవుతున్న నేపద్యంలో ప్రజల ఇక్కట్లు,పారిశుద్ద్య లోపాలు అధికారుల సేవలు ప్రజాదర్బార్ లో ఎం ఎల్ ఏ దృష్టికి వెళ్లి ప్రజలకు మేలు జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం.. విష్ యు అల్ ద బెస్ట్ ఎం ఎల్ ఏ గారు..