ప్రభాకర్ చౌదరి ఆగస్టు4(ప్రజాన్యూస్):
నేషనల్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల సీనియర్ అసిస్టెంట్ .ఎస్.రఫీ అహ్మద్ పదవి విరమణ అభినందన సభ నేషనల్ పిజి కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు చైర్మన్ డా.ఇంతియాజ్ అహమ్మద్ ఆద్వెర్యంలోఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికిఅతిథులుగా యోగి వేమన విశ్వవిద్యాలయం బయోకెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ పాషావలి హాజరయ్యరు..పదవి విరమణ అభినందన సభలో అధ్యాపకులు అధ్యాపకేతర బృందం మరియు కుటుంబ సభ్యులు మొదట నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్ ను ఘనంగా సన్మానించారు అనంతరం చైర్మన్ డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రశంస పత్రాన్ని రఫీ అహమ్మద్ కి అందజేశారు అనంతరం బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అధ్యాపకులు అధ్యాపకేతర బృందాలుఎస్.రఫీఅహ్మద్(విద్యాసంస్థలపరిపాలనాధికారి)నిఘనంగా శాలువాతో పూలమాలలతో సన్మానించారు
ఈ సందర్భంగా నేషనల్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల సీనియర్ అసిస్టెంట్ గా పదవి విరమణ పొందిన ఎస్.రఫీ అహ్మద్ మాట్లాడుతూ నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్ నేషనల్ విద్యాసంస్థలకు వటవృక్షం (మర్రిచెట్టు) వంటి వారని ఆయన నీడ లో అనేక మంది తో పాటు తాను కూడా ఆశ్రయం పొందుతు ఇంత వాణ్ణి అయ్యానన్నారు .ఎంతోమంది విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు అంటే అందుకు కారణం నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ చలవే అని ఆయన కొనియాడారు తాను జూనియర్ కళాశాల సీనియర్ అసిస్టెంట్ గా ప్రస్థానం ప్రారంభించి నేషనల్ విద్యాసంస్థల్లో పరిపాలన అధికారి గా నిబద్ధతతో విధులు నిర్వహించి నేడు మంచి ఆరోగ్యం ఆయుష్ తో పదవి విరమణ గావిస్తూ ఉన్నానంటే తనకు అండగా నిలబడిన తండ్రి సమానులు డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్ గొప్పతనమే కారణం అన్నారు..ఇంతవరకు తనకు సహకరించిన అధ్యాపకులకు అధ్యాపకేతర బృందాలకు కళాశాల సిబ్బందికి అహమ్మడ్ర ఫీకృతజ్ఞతలుతెలిపారు..అనంతరం అతిధులు రఫీ చేసిన సేవలను కొనియాడి ఘనంగా దుశ్శాలువతో పూలమాలల తో సత్కరించారు… కార్యక్రమంలో నేషనల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు