రాష్ట్ర వ్యాప్తంగా పేద దూదేకుల విద్యార్థుల సంక్షేమ కోసం పాటుపడతాం…దూదేకుల సంఘం రాష్ట్ర నేతలు సిద్దయ్య, కన్నయ్య

ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి

ఆళ్లగడ్డ,4మే 2025(ప్రజాన్యూస్)

 దూదేకుల నూర్ భాషా ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘ ఆత్మీయ సమావేశం ఆదివారం నంద్యాల పట్టణంలోని గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాష్ట్ర అధ్యక్షులు సిద్దయ్య,కార్యదర్శి కన్నయ్య గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబన్ మరియు డాక్టర్ మహమ్మద్ హాజరు అయ్యారు.. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశము లో సంఘ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు వారి సంక్షేమ గురించి చర్చించడంతోపాటు సంఘ కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలి అనే విషయమై పూర్తి ప్రణాళికను చర్చించడమైనది.ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తూ, సంఘం ద్వారా రాష్ట్రంలోని పేద దూదేకుల విద్యార్థులకు ఉన్నత విద్యకు సహాయం అందించేందుకు, ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహ కాలను అందించే విధంగా సంఘం పనిచేస్తుండన్నారు. సమాజంలో అందరూ బాగుండాలి.. అందులో దూదేకుల వర్గం వుండాలనే సంకల్పం తో సంఘ నేతలు, సభ్యులు పనిచేయాలన్నారు.. అనంతరం నంద్యాల జిల్లా దూదేకుల ఉద్యోగ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసారు..అధ్యక్ష ప్రధాన కార్యదర్సులుగా మౌలాలి మరియు దస్తగిరి,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జమాల్ బాషా, కోశాధికారిగా అబ్దుల్ జలీల్ కార్యవర్గ సభ్యులుగా రఫీ ,చిన్న దస్తగిరి, అస్సాన్, నాగూర్ వలి, మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్ ,పీరా, బాలుడు, యాసిన్ బాబు ఎస్ ఎం హుస్సేన్, మహిళా కార్యదర్శిగా డి ఉమా భారతి ను ఎన్నుకున్నారు.. నూతనంగా ఎన్నికైన కమిటీకి రాష్ట్ర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *