భూసేకరణ ఒకరిది..పరిహారం మరొకరికి ..Nh. 167 K భూసేకరణ అధికారుల లీలలు

ప్రభాకర్ చౌదరి ప్రజాటివి ప్రతినిది

ఆత్మకూరు,మార్చి 4 (ప్రజాన్యూస్)

* 167 K జాతీయ రహదారి భూసేకరణ అధికారుల లీలలు.

* రోడ్డు విస్తరణకు భూమి పోయిన రైతుకు కాకుండా ఇతర సంభందం లేని మహిళకు భూమి పరిహారం

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గుమ్మడాపురం మజారా శింగరాజుపల్లె గ్రామానికి చెందిన మూగి. వెంకటరమణారెడ్డి ( యం. వి . రమణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ) అను రైతుకు సంబందించిన సర్వే నెంబర్ 331 తరిభూమి ( మాగాని ) 0.13 సెంట్లు కల్వకుర్తి – నంద్యాల 167 K జాతీయ రహదారిలో భూమి పోయింది. ప్రభుత్వం రూ. 47,756 వేల పరిహారం చెల్లించేందుకు ఆవార్డు నోటీసు కూడా రైతుకు అందించింది.ఈమేరకు ప్రభుత్వం గత నెల జనవరి 31తేది నుంచి మొదటి విడతగా రైతులకు భూమి నష్ట పరిహారం వారి బ్యాంకు ఖాతాలోనే జమచేస్తుంది. రైతు రమణారెడ్డి నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని 167 K భూసేకరణ కార్యాలయంకు వెళ్లి నా పొలం డబ్బులు రాలేదని సంబందించిన అధికారులను కోరగా రెండవ విడత నీకు నీ పొలం డబ్బులు జమ అవుతాయని చెప్పడంతో వెనుతిరిగారు.అయితే  మార్చి 4 వ తేదీ  శింగరాజుపల్లె గ్రామానికే చెందిన మారేడు ప్రమీలమ్మ భర్త యోహాను రమణారెడ్డి ఇంటికి వచ్చి  మీ పొలం డబ్బులు ప్రభుత్వం మా భార్య బ్యాంకు అకౌంట్ కు జమ చేశారు. మీ డబ్బులు మాకెందుకు ,మేము బ్యాంకు నుంచి తీసుకోచ్చాము తీసుకోండి  అని చెప్పడంతో గ్రామస్థులు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. రెడ్డిగారి పొలం డబ్బులు దళిత మహిళ అకౌంట్ కు వేయడమేంటి. ఆయన పొలం పక్కన కూడా ప్రమీలమ్మ పొలం లేదే సంబంధం లేని వారికీ భూమి పరిహారం డబ్బులు ఎలా బ్యాంకు అకౌంట్ కు జమచేస్తారు, వారు బ్యాంకు నుంచి విడుదల చేసుకొని భాదిత రైతుకు నేరుగా ఎలా ఇస్తారని ప్రశ్నలు గుప్పించారు. ఇలా ఇంకెంత మంది రైతుల పరిహారం డబ్బులు చేతులు మార్చారో 167 K భూసేకరణ అధికారులకే తెలియాలి. జిల్లా కలెక్టర్ వెంటనే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి అని భాదిత రైతు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *