నంద్యాల ఆర్టిసి బస్టాండులో ద్విచక్రవాహన పార్కింగ్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు

ప్రజాటివి ప్రతినిది మూల్పూరి ప్రభాకర్ చౌదరి

నంద్యాల ఆర్టిసి బస్టాండులో ద్విచక్రవాహన పార్కింగ్ లేక ప్రయాణీకులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గతంలో ఆర్టిసి బస్టాండు ప్రాంగణంలో రెండు ద్విచక్రవాహనాలకోసం పార్కింగ్ ఏరియాను ఆర్టిసి అదికారులు ఏర్పాటుచేశారు..అయితే నేడు నంద్యాలజిల్లా కేంద్రంగా మారడంతో ప్రయాణీకుల రద్దీ కూడా పెరిగింది..పెరిగిన ప్రయాణీకుల సంఖ్యలకు అనుగుణంగా పార్కింగు స్థలాలను పెంచవలసిన ఆర్టిసి అదికారులు గతంలో ఉన్న రెండు పార్కింగు ఏరియాలను తీసివేసి ఒకే ఒక పార్కింగును ఏర్పాటుచేయడంతో ప్రయాణీకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి..ఈనేపద్యంలో పార్కింగ్ స్థల కాంట్రాక్టరు తనకు కేటాయించిన స్థలంతో పాటుగా ప్రయాణీకులు బస్టాండు లోపలికి వెళ్లే రహదారి,గ్యారేజ్ కు బస్సులు వెళ్లే ప్రాంతం,పబ్లిక్ టాయిలెట్ల వద్ద స్థలాన్ని కూడా ఆక్రమించుకుని పార్కింగ్ నిర్వహిస్తున్నారు..నిత్యం ఆర్టిసి బస్టాండులో జరుగుతున్న పరిస్తితిని కళ్లతో చూస్తూ కూడా ఆర్టిసి అదికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది..నంద్యాల జిల్లా కేంద్రం కావడంతో జిల్లా కార్యాలయాలు, నంద్యాల ప్రాంతంలో కేంద్రీకృతం కావడంతో అందులోని సిబ్బంది,ఇతర ప్రాంతాలనుండి ప్రయాణించాల్సిన పరిస్థితులలో వాహన పార్కింగ్ లేక పోవడంతో తమ వాహనాలను ఎక్కడపెట్టాలో తెలియని పరిస్థితి ఏర్పడింది..అడ్డదిడ్దంగా వాహానాలు పెట్టి వాహనదారులు వెళ్లిపోవడంతో బస్టాండ్ లోపలికి వెళ్లవలసిన ప్రయాణీకులు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు..పార్కింగ్ విషయంలో ప్రయాణీకులు ఇదేమిటని అడిగితే తమ వద్ద పార్కింగ్ స్థలంలేదని మీరు వాహనాన్ని వేరే ఎక్కడైనా పెట్టుకోవాలని వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి..ఆర్టిజి బస్టాండు ప్రాంగణంలో ఖాళీ ప్రాంతాలు ఉన్నప్పటికీ అదికారులు పార్కింగుకోసం కేటాయించకపోవడం పట్ల ప్రయాణీకులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు..ఇప్పటికైనా ఆర్టిసి అదికారులు స్పందించి పార్కింగు విషయంలో ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *