పులిమద్ది గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం – గ్రామ సభలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ మార్కెట్ యార్డుచైర్మన్ గుంటుపల్లి

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 03 డిశెంబరు  2025(ప్రజాన్యూస్) :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం, పులిమిద్ది గ్రామంలో “రైతన్న మీకోసం – గ్రామ సభ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిఎన్.ఎండి. ఫరూక్ హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలు, పంటల సాగులో మెళకువలు, రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు మరియు వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలపై రైతులతో చర్చించారు

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరిగిందని. కొత్త వ్యవసాయ పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించామన్నారు. ప్రభుత్వ రాయితీలు మరియు సహాయక చర్యల గురించి రైతులకు వివరించడం జరిగిందని.రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్రామంలో రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ గ్రామ సభ ద్వారా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, ప్రభుత్వం అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషిచేస్తుందన్నారు..చాలామంది రైతులు లింకురోడ్లకు రోడ్లు మంజూరు చేయాలని కోరుతున్నారని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.. మంత్రి పరూఖ్ సహకారంతో మార్కెట్ యార్డు కు వైభవం తెస్తామన్నారు..అనంతరం కార్యక్రమంలో భాగంగా   రైతులకు ఎరువులను పంపిణీ చేశారు..ఈ గ్రామ సభలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఎమ్మార్వో శ్రీవాణి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో ప్రసాద్, పులిమద్ది గ్రామ టిడిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, సర్పంచ్ రఘురాం రెడ్డి, క్లస్టర్ చంద్రారెడ్డి, పోలూరు జేయుడు, చాపరేవుల భూపాల్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *