ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,3మే 2025(ప్రజాన్యూస్)
రాస్ట్ర దూదేకుల ఉద్యోగుల సంక్షేమసంఘం ఆత్మీయసమావేశం మే 4 ఆదివారం ఉదయం నంద్యాలపట్టణంలోని ఎన్జిఓకాలనిలోని గురురాజ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో నిర్వహిస్తన్నట్లు ఎపి దూదేకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు సిద్దయ్య, కన్నయ్య తెలిపారు..
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఆదివారం నిర్వహిస్తున్న ఈసమావేశంలో ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు వారి సంక్షేమంగురించి చర్చించడంతో పాటుగా సంఘ కార్యకలాపాలను విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.అలాగే దూదేకుల వారిలో పేద వారైన విద్యార్ధులను గుర్తించి వారికి ఆర్ధిక సహాయం చేసేందుకు, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ప్రతిభాపురస్కారాలు అందించే దిశగా ప్రణాలికలు రూపిందిస్తామన్నారు..కావున నంద్యాల జిల్లా వ్యాప్ధంగా ఉన్నదూదేకుల ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగులు ఈకార్యక్రమానికి తప్పకుండా హాజరయి కార్యక్రమాన్ని జయప్రదంచేయాలని వారు కోరారు..