ఆళ్లగడ్డ జులై2(ప్రజాన్యూస్ ): కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లో మిత్రుని బర్త్ డే వేడుకలుకు వెళ్లి గండలేరు రిజర్వాయర్ లో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి..ఆళ్ళగడ్డ డిఎస్పీ రాజేంద్ర రుద్రవరం పోలీసులు ప్రత్యేక బృందాలతో వెళ్లి గాలించి మృతదేహాలను తల్లిదండ్రుల కు అప్పగించారు. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆరిఫ్,సులేమాన్ మృతదేహాలను చూసి యువకుల తల్లిదండ్రులు బోరున విలపించారు..ఈ సంఘటనతో పట్టణంలోని పాత మసీదు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. విషయం తెలిసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు… రెండు కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు..