ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల,జూన్ 2(ప్రజాన్యూస్)
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నంద్యాల పట్టణంలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు.. ఈసందర్బంగా. న్యూక్లియస్ కళాశాల కరస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యూక్లియస్ కళాశాల నుండి ఓసీ క్యాటగిరిలో అనీషా తబసుమ్ 10280 ర్యాంకు అలాగే ఎస్సీ కేటగిరీలో ఎస్ లికిత్ 1145 ర్యాంకు, టి. ప్రదీప్ 2949 (ప్రిపరేటరీ ర్యాంక్), కే. సతీష్ 4610 (ప్రిపరేటరీ ర్యాంక్), ఎస్ అమూల్య 5486 (ప్రిపరేటరీ ర్యాంక్), ఐఐటీ ర్యాంకులు సాధించడం జరిగింది అని తెలిపారు. కళాశాల డైరెక్టర్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలోనూ న్యూక్లియస్ కళాశాల నుంచి పలువురు నీట్ లో సీట్లు సాధించే అవకాశం ఉంది అని, అలాగే రాబోయే నీట్ ఫలితాలలోనూ ‘కీ ‘ పరిశీలించిన తర్వాత న్యూక్లియస్ కళాశాల నుంచి 5 మెడికల్ సీట్లు సాధించే అవకాశం ఉంది అని తెలిపారు.