నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్,మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 01అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :

నంద్యాల పట్టణం 19వ వార్డు పొన్నాపురం కాలనీలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్,మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబుతో కలిసి బుధవారం నాడు “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి వెళ్లి అందజేశారు.

పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, పింఛన్లు అందుకున్నప్పుడు లబ్ధిదారుల కళ్లల్లో కనిపించిన ఆనందమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. పింఛన్ల పెంపుదలలో నారా చంద్రబాబు నాయుడు గారే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, 200 రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు, అనంతరం వెయ్యిని రెండువేలకు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వం 2వేల రూపాయల పింఛన్‌ను 3వేలకు పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపి మాట తప్పిందని, ప్రజలకు సంవత్సరానికి రూ.250 మాత్రమే పెంచుతూ నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం 3వేల రూపాయల పింఛన్‌ను 4వేల రూపాయలకు పెంచి, అదనంగా మూడు నెలల ముందుగానే ప్రతీ లబ్ధిదారునికి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 7వేల రూపాయలను మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందన్నారు.. ఇకపై ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందజేయబడతాయని, ఒకటవ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీన లబ్ధిదారులకు ముందుగానే పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి, ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, వెంకటదాసు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, పొన్నాపురం కాలనీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *