నంద్యాల లో జగనన్న టౌన్ షిప్ కొరకు భూ ముల ను పరిశీలించిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి

నంద్యాల సెప్టెంబర్ 1(ప్రజాన్యూస్):అక్రమ లే అవుట్ లు అనధికార కట్టడాల ఈతి బాధలనుండి మధ్యతరగతి ప్రజానీకానికి విముక్తి కల్పించడం కొరకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న టౌన్ షిప్ విధానానికి శ్రీకారం చుట్టిందని సబ్ కలె క్టర్ చాహత్ బాజ్ పాయి పేర్కొన్నారు

బుధవారం పట్టణ శివార్లలోని కర్నూలు రోడ్డు లో ఆమె మున్సిపల్ కమీషనర్ వెంకట కృష్ణ, తహసీల్దార్ రవికుమార్ తో  కలిసి భూముల ను పరిశీలించారు.. ఈ సందర్భంగా నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు గాను జగనన్న టౌన్ షిప్ కార్యక్రమమునకు శ్రీకారం చుట్టింది అని అందులో సిమెంట్ రోడ్లు, ఫుట్ పాత్ లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్స్, స్ట్రీట్ లైటింగ్, పార్కులు, ల్యాండ్ స్కేపింగ్ , మంచి నీటి సరఫరా. వగైరా అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ టౌన్ షిప్ నిర్మాణం చేయబడుతుందన్నారు.. ఈ స్థలం దాదాపు గా సెంటు రు.6లక్షల వరకు ఉంటుందని ఆసక్తి కలిగిన ప్రజలు ఏ కేటగిరీ కావాలో (150/200/250) చ.గ మరియు ఏ ప్రాంతం నందు (కడప రోడ్డు / కర్నూల్ రోడ్డు/ఆత్మకూర్ రోడ్డు) కావాలో . మీ అభిప్రాయమును / అంగీకారమును ఆయా వార్డు సచివాలయం నందు ప్లానింగ్ సెక్రెటరీ కి సమర్పించాలని సబ్ కలెక్టర్ కోరారు

కేటగిరీ-1—– 150 చ.గ (3 సెంట్లు) —- 18 లక్షలు దాదాపుగా

కేటగిరీ-2 —– 200 చ.గ (4 సెంట్లు) —- 24 లక్షలు దాదాపుగా

కేటగిరీ-3—— 240 చ.గ (5సెంట్లు) — 30 లక్షలు దాదాపుగా

విలువగల ప్లాటులు అన్ని హంగులతో ఏర్పాటు చేస్తామన్నారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *