ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,ఆగష్టు1 2025(ప్రజాన్యూస్)
ప్రధానమంత్రి సూర్యఘర్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఆళ్లగడ్డ ADE సుబ్రహ్మణ్యం సూచించారు.
ఆళ్లగడ్డ మండలం శాంతి నగరం గ్రామంలో గురువారం సాయంత్రం పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు వివరించారు. గ్రామస్తులు తమ ఇంటిపై సౌర పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రూ.78,000 సబ్సిడీ లభిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్, ఎంపీడీవో నూర్జహాన్, మండల తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి, ఏఈ కృష్ణయ్య, ఎర్రగుంట్ల ఎస్బిఐ మేనేజర్ నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.