ఆత్మకూరు ఆగస్టు1(ప్రజాన్యూస్): కార్మిక,రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, కర్షకులందరు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు,ఆo.ప్ర.వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణం లోని వెంగల్ రెడ్డి నగర్, అర్బన్ కాలనీ, వీరభద్ర ఏరియా, అప్పలరావు ఏరియా, తిక్కయ్య స్వామి దర్గా, తోటగేరి లలో రెండవ రోజు ప్రచార యాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు వి. ఏసురత్నం, పట్టణ అధ్యక్షులు ఎం. రజాక్ కార్యదర్శి ఏ. రణధీర్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి. స్వామన్న భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి షైక్ ఇస్మాయిల్, రైతు సంఘం నాయకులు వీరన్న లు మాట్లాడుతూ దేశ రాజధాని లో జరుగు రైతాంగ పోరాటాన్ని నిరుగార్చే పద్దతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందన్నారు.బీజేపీ కుయుక్తులను తిప్పికొడుతూ ఈ మధ్యకాలంలో రైతాంగ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందిని వారన్నారు.ఉత్తర భారత దేశంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల నుండి కూడా కార్మికులను,కర్షకులను ఐక్యం చేసి కేంద్రలోని బిజెపి ప్రభుత్య మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేసేంతవరుకు పోరాటాలనుఉదృతంచేస్తామనివారుహెచ్చరించారు.కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు 1942 స”లో అప్పటి ఆంగ్లేయుల కాలంలోనే పోరాడి కార్మికుల సంక్షేమం కోసం 44 చట్టాలను మరియు 8 గ”ల పనిని సాదించుకోవడం జరిగిందన్నారు.కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరు గార్చుట కోసం బిజెపి ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను తీసుకోచిందన్నారు.మున్సిపల్ పట్టణాలలో ఉపాధిహామీ పథకం పనులు ప్రారంభించి వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని,రూ.600/-లు వేతనం ఇవ్వాలని,ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని,కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని,భూయజమానులకు సంబంధము లేకుండా బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వాలని ఆగస్టు 9వ తేదీన MRO కార్యాలయం ముందు జరుగు సేవ్ ఇండియా ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు,రైతులు,ఉపాధి కూలీలు,అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికసంఘం నాయకులు మహమ్మద్, షఫీల్లా, రమణ, మౌలాలి, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు రోషన్, రఫిక్, మాబాష, మియాస, ఆటో యూనియన్ నాయకులు చాంద్, హుసెన్సా, సలీం, ఇబ్రహీం, అలీ, రాముడు, రైతు సంఘం నాయకులు శివుడు, అంబయ్య, డి వై ఎఫ్ ఐ నాయకులు చాంద్, గణపతి,లతో పాటు కార్మికులు,కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.