నంద్యాల ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు

ప్రజాటివి ప్రతినిది అక్షింతల శ్రీనివాసులు

నంద్యాల,జూలై1(ప్రజాన్యూస్)

నంద్యాల ఎల్ఐసి కార్యాలయంలో మంగళవారం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 75 వ ఆవిర్భావ దినోత్సవం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు హరిప్రియ యూనియన్ జండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంఘం నాయకుడు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గత ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో సంస్థ ప్రగతి ఉద్యోగుల భవిష్యత్తు కోసం విశేష కృషి చేసిందన్నారు.ఎల్ఐసీ ఆవిర్భావంతోపాటు దేశవ్యాప్తంగా అది పటిష్ట పడాలని భారత ఆర్థిక వ్యవస్థకు ఒక చోదక శక్తిలా ఏర్పడాలని నిరంతరం ఉద్యోగులను పురమాయిస్తూ వచ్చిందని, అడ్మినిస్ట్రేటివ్ పనికి మాత్రమే సంబంధించిన ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నూతన వ్యాపార సేకరణలో నిమగ్నమై ఉండే ఫీల్డ్ ఫోర్స్, ఏజెంట్లను అనేక సందర్భాల్లో కదిలిస్తూ, సర్విసింగ్ ఫోర్ట్ నైట్లను, నూతన వ్యాపార సేకరణకు కార్యక్రమాలను పిలుపునిచ్చిందన్నారు..మెగా బిజినెస్ డే అను పేరు పైన నూతన వ్యాపారంలో దేశవ్యాప్త రికార్డు నెలకొల్పడానికి మేనేజ్‌మెంట్తో కలిసి తనవంతు కృషిచేసి ఎల్‌ఐసి ఇండియా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించేలా చేసిందన్నారు..ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ అంటే ఎల్‌ఐసి అనే పేరు సంపాదించడంలో, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గా అవతరించడంలో మరియు ఇప్పటికి కూడా 70 శాతానికి పైగా ప్రజలు ఎల్ ఐ సి ని మాత్రమే ఆదరించేలా చేయడంలో ఒక కార్మిక సంఘంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎంతో కృషి చేసిందని కొనియాడారు.పాలసీదారులకు మెరుగైన సేవలు అందించడమే మన కర్తవ్యం అని 1974 లో తన అఖిల భారత మహా సభలో తీర్మానాన్ని కూడా ఆమోదించిందని, “సంస్థ ప్రగతియే ఉద్యోగుల భవిష్యత్తు” అన్న నినాదాన్ని మర్చిపోకూడదని ఎప్పటికప్పుడు ఉద్యోగులను వెన్నుతడుతూనే ఉంటుందన్నారు.. అందుకే ఏ ప్రైవేట్ కంపెనీ కనీసం ఎల్‌ఐసి మొత్తం వ్యాపారంలో 10 శాతానికి కూడా చేరుకోలేకపోతున్నాయన్నారు..ఎల్‌ఐసీ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ఎఐఐఇఎ అనేక సందర్భాల్లో ఆచరించి విజయం సాధించిందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ ఏ భువనేంద్ర, ట్రెజరర్ పిసి రామకృష్ణుడు, ఏ వెంకటరాముడు ఎం శేషగిరిరావు టిఎండి షాకీర్ ఉద్యోగ సంఘం నాయకులందరూ పాల్గొన్నారు.
,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *